గుంటూరు జిల్లా బాపట్ల మండలం వెదుళ్ళపల్లి రైల్వే ట్రాక్ వద్ద విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలతో పిడుగు పడి 150 గొర్రెలు మృతి చెందాయి. జీవనాధారం కోల్పోయిన నాలుగు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మద్దిబోయినవారిపాలెం గ్రామానికి చెందిన మద్దిబోయిన వీరయ్య, బాజీ శేషయ్య, అక్కి ముసలయ్య.. గొర్రెలపైనే ఆధారపడి బతుకుతున్నారు. వెదుళ్ళపల్లి రైల్వే ట్రాక్ వద్ద దోమలు ఎక్కువగా ఉన్న కారణంగా.. దోమతెరలు కట్టి గొర్రెలను రాత్రుళ్లు అందులోనే ఉంచుతున్నారు. తెల్లవారుఝామున పిడుగు పడిన ఘటనలో 150 గొర్రెలు ఆ శబ్దానికి మృతి చెందాయి. సుమారు 7 లక్షల విలువ చేసే జీవాలు మృతిచెందాయంటూ.. తమ బతుకులెట్లా అంటూ వాటి యజమానులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆర్థికంగా చితికిపోయిన తమను ఆదుకోవాలంటూ వేడుకున్నారు.
పిడుగుపాటు.. రోడ్డున పడ్డ నాలుగు కుటుంబాలు - 150 sheeps are died
గుంటూరు జిల్లా బాపట్లలో పిడుగుపాటుకు 150 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటనతో నాలుగు కుంటుంబాలు వీధిన పడ్డాయి.
పిడుగు పడి 150 గొర్రెలు మృతి