పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు, మహిళలు 114వ రోజు ఆందోళనలు కొనసాగించారు. అమరావతి వెలుగు పేరుతో తుళ్లూరు మండలం మందడం, వెంకటపాలెం, బోరుపాలెం, రాయపూడి, అబ్బిరాజు పాలెంలో రైతులు, మహిళలు ఇళ్ల వద్దే దీక్షలు కొనసాగించారు. లాక్ డౌన్ సమయంలో సీఆర్డీఏ అధికారులు చేస్తున్న సర్వేలను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. మందడంలో మహిళలు 101 సార్లు శ్రీలక్ష్మీ నరసింహ స్వామి పారాయణం నిర్వహించారు. తుళ్లూరులో పిల్లలు, మహిళలు కొవ్వొత్తులతో నిరసన తెలియజేయగా, ఓ మహిళా రైతు నవ ధాన్యాలతో అమరావతి అక్షరాలను అలంకరించారు.
114వ రోజు కొనసాగిన అమరావతి రైతుల నిరసన - అమరావతి వెలుగు తాజా వార్తలు
రాజధాని కోసం అమరావతి రైతుల ఆందోళన 114వ రోజు కొనసాగింది. లాక్ డౌన్ సమయంలో సీఆర్డీఏ అధికారులు చేస్తున్న సర్వేలను వెంటనే ఆపేయాలని రైతులు డిమాండ్ చేశారు.
రాజధానికై అమరావతి రైతుల ఆందోళనలు