పర్యాటక కేంద్రంగా నెల్లూరు నగరం - నెల్లూరు నగరం
నెల్లూరు నగరం పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నల్ల చెరువు తో పాటు, పార్కులను అభివృద్ధి చేస్తున్నారు.
పర్యాటక కేంద్రంగా నెల్లూరు నగరం
పార్కుల అభివృద్ధి మాత్రమే కాక, నగరంలో ఉన్న స్వర్ణాల చెరువును 'నెక్లెస్ రోడ్డు' మాదిరిగా అభివృద్ధి చేస్తున్నారు. బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ పేరుతో సుమారు 10 కోట్లు ఖర్చు చేశారు. బోటింగ్ ఏర్పాటుతో విహార కేంద్రంగా మార్చారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన ఇరుకళల పరమేశ్వరీ ఆలయం ఈ నల్లచెరువులోనే ఉంది. ఈ ఆలయం వద్ద పుష్కరిని, ఘాట్ ఏర్పాటు చేస్తున్నారు.
నుడా ఆధ్వర్యంలో ప్రణాళికతో నిర్మాణపనులు వేగంగా చేస్తున్నారు. నెల్లూరు నగరానికి తలమానికంగా మారనున్న ట్యాంక్ బండ్పై రాష్ట్రానికి చెందిన 15 జాతీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. చక్కటి పార్కులు నిర్మించనున్నారు. పిల్లలు ఆటలాడుకునేందుకు ప్రత్యేక పార్కు. వాకింగ్ ట్ర్యాక్, సైకిల్ నడిపేందుకు ట్రాక్, గ్రంథాలయం ఏర్పాటు చేస్తున్నారు.
స్వర్ణాల చెరువు పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేసేందుకు వేగంగా పనుల చేపడుతున్నామని మంత్రి నారాయణ తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వర్ణాల చెరువును నెక్లెస్ రోడ్డుగా మారిస్తే నెల్లూరు నగరం పెద్ద పర్యాటక కేంద్రంగా మారుతుంది.