నేడే బందరు పోర్టు పనులు ప్రారంభం - port
ఈ రోజు మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. 11,500 కోట్లతో అత్యాధునిక రీతిలో నిర్మాణం జరగనుంది. తొలి విడత పనులు కేవలం 18 నెలల్లో పూర్తి చేయనున్నారు.
రాష్ట్రంలో మరో ఓడరేవు కు ఈ రోజు పునాది పడనుంది. కృష్ణాజిల్లా, మచిలీపట్నం లో నూతన ఓడరేపు నిర్మాణాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. మచిలీపట్నాన్ని పర్యాటకంగా, వాణిజ్య పరంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఇప్పటికే పలు ప్రాజెక్టులు చేపట్టిన సీఎం ప్రతిష్ఠాత్మకమైన ఓడరేపు నిర్మాణాన్ని తలపెట్టారు. 11వేల 500 కోట్ల వ్యయంతో అత్యాధునిక రీతిలో పోర్టు ను నిర్మించనున్నారు.
పోర్టు పనులు పలు విడతలుగా చేపట్టనున్నారు. తొలి విడత పనులు కేవలం 18 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని నవయుగ నిర్మాణ సంస్థకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పోర్టు కోసం ఎన్నో దశాబ్దాలుగా పోరాడిన న్యాయవాదులు, రైతులు, ప్రజా సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిపక్షంలో ఉండగా పోర్టు కోసం పోరాడి.. మంత్రి హోదాలో మచిలీపట్నం వాసుల కల సాకారం చేసిన మంత్రి కొల్లు రవీంద్రను అందరూ అభినందిస్తున్నారు. బందరు ఓడరేవు రాష్ట్రానికి కలికి తురాయిగా మిగిలుతుందని కొల్లు రవీంద్ర అన్నారు.