ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆ పని నటులకు తగునా!' - amaravathi

దేశంలో ఏర్పడిన అనిశ్చితి వల్లే భాజాపా యేతర పార్టీలన్నీ ఏకమవుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

chandrababu

By

Published : Feb 20, 2019, 9:38 AM IST

Updated : Feb 20, 2019, 11:56 AM IST

తెదేపా నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వార్థం కోసం కేంద్రందేశాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇలాంటిచర్యలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు.నేరస్థులతో సినీ నటుల భేటీ దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్లే అవకాశం ఉందన్నారు. పేదల సంక్షేమానికి అందరూ కలసి రావాలని కోరారు. పనిచేసే ప్రభుత్వాలనే ప్రజలు ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి
వైకాపాది పెత్తందారీ వ్యవస్థ:నేరాలు నుంచి కలిగే లబ్ది ద్వారా వైకాపా రాజకీయం చేస్తోందని సీఎం విమర్శించారు. హైదరాబాద్ కేంద్రంగా బ్లాక్​మెయిల్​ రాజకీయాలు జరుగుతున్నాయని ఉద్ఘాటించారు. ఆ పార్టీలో పెత్తందారీ వ్యవస్థ నడుస్తోందన్నారు. కృష్ణా జిల్లాలో తెదేపా నేతలందరూ గొడవల్లేకుండా పనిచేసుకుంటున్నారని చంద్రబాబు తెలిపారు .దేశంలో ప్రజాస్వామ్య అనివార్యత:5 కోట్ల మంది ఆంధ్రులను మోసం చేసి నేటికి ఐదేళ్లు అవుతోందని సీఎం అన్నారు. ప్రత్యేక హోదాతో సహ మిగిలిన హామీలను గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు. కేంద్రం చేసిన మోసానికి వార్షిక నిరసనలు తెలియజేయాలన్నారు. జాతీయ స్థాయిలో భాజాపా యేతర పార్టీలతో కలసి పనిచేస్తామని స్పష్టం చేశారు.
Last Updated : Feb 20, 2019, 11:56 AM IST

ABOUT THE AUTHOR

...view details