రైతన్నకు అండగా అన్నదాత సుఖీభవ: సీఎం - cm chandrababu
రాష్ట్ర రైతాంగాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చుదిద్దుతామని సీఎం తెలిపారు. వ్యవసాయం-అనుబంధ రంగాలపై శాసనసభలో జరిగిన చర్చలో చంద్రబాబు మాట్లాడారు.
శాసనసభ బడ్జెట్ సమావేశంలో వ్యవసాయం-అనుబంధ రంగాలపై సీఎం సమాధానం
భాజపాపై గరం
అమిత్ షా అబద్ధాలు చెప్పడానికే రాష్ట్రానికి వచ్చారని విమర్శించారు. అమిత్ షా తన తనయుడి కోసమే పనిచేస్తున్నారన్నారు. భార్యను చూసుకోలేని వారు దేశానికి ఏం చేయగలరన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరి వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. తెలుగు ప్రజల ఆత్మాభిమానంపై దెబ్బకొట్టాలని చూస్తే భంగపాటు తప్పదని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా సాధించే వరకూ తెదేపా పోరాటం ఆగదని తెలిపారు.