నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం నేడు సమావేశం కానుంది. అసెంబ్లీ వాయిదా అనంతరం ఈ భేటీ జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి త్వరలో 6 జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఈ కోడ్ పూర్తయ్యేలోపు, సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వచ్చి, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ వచ్చేలోపు ఇదే చివరి మంత్రివర్గ సమావేశం కావొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిపాలన పరంగా పెండింగ్లో ఉన్న అన్ని అంశాలను పరిష్కరించుకోవాలని యోచిస్తోంది ఏపీ సర్కారు .