Kidnapping incident in AP: ఏలూరు జిల్లాలోని కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్ పిళ్ల గోళ్ల శ్రీలక్ష్మి భర్త సివిల్ ఇంజినీరు ఈడ్పుగంటి నవరాజును ఇద్దరు వ్యక్తులు కిడ్నాపు చేసేందుకు ప్రయత్నించారు. పని నిమిత్తం తన వద్దకు వచ్చిన ఇద్దరు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితుడు ఏలూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. నవరాజు ఏలూరులోని డీమార్టు సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఓ భవనం వద్ద ఉండగా మంగళవారం ఇద్దరు యువకులు అతని వద్దకు వచ్చి పని అడిగారని.. ఈ క్రమంలోనే అదే సమయంలో రోడ్డు ప్రక్కగా ఓ కారు వచ్చి ఆగటం ఆ ఇద్దరు యువకులు నవరాజును ఆ కారులోకి బలవంతంగా ఎక్కించే ప్రయత్నం జరిగిందని తెలిపారు. ఊహించని ఈ పరిణామానికి అక్కడ "పనులు చేస్తున్న కూలీలు ఏం జరుగుతుందో తెలియక తొలుత ఆందోళన చెందారు. వెంటనే పరుగున అక్కడకు చేరుకుని యువకుల ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు తెలిపారు. విషయం జఠిలంగా మారటంతో ఆ యువకులిద్దరు నవరాజును వదిలి, కారులో పారిపోయారని పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Kidnapping: ఏలూరు జిల్లాలో కిడ్నాప్ కలకలం.. పని కోసం వచ్చి ఏం చేశారో తెలుసా? - కిడ్నాప్ వార్త
Kidnapping incident: రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్ పిళ్ల గోళ్ల శ్రీలక్ష్మి భర్త సివిల్ ఇంజినీరు ఈడ్పుగంటి నవరాజు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. పని కోసం అంటూ తన దగ్గరకు వచ్చిన ఇద్దరు దుండగులు తనను కారులో తీసుకెళ్లేప్రయత్నం చేశారని నవరాజ్ ఆరోపించారు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Kidnapping
ఇవీ చదవండి
- ఈనెల 11న ప్రధాని విశాఖ పర్యటన.. కార్యక్రమాలివే..
- ఎమ్మెల్యేల ఎర కేసు.. ప్రధాన నిందితుడు రామచంద్ర భారతిపై మరో కేసు
- గ్రహణం సమయంలో ఈ రాశుల వాళ్లు ఈ మంత్రం పటిస్తే శుభకరం