ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యాభై ఏళ్లుగా నివాసం.. ఇల్లు కూల్చేసిన అధికారులు - ఏలూరు మాదేపల్లి రోడ్డు

House demolition: అధికారులు ఉన్నపళంగా ఇల్లును కూల్చేయడంతో రోడ్డున పడ్డామని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు మాదేపల్లి రోడ్డులోని మున్సిపాలిటీ స్థలంలో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు. 50 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమకు.. చెప్పా పెట్టకుండా ఇల్లును అధికారులు కూల్చేశారని బాధితులు వాపోతున్నారు.

House demolition
House demolition

By

Published : Nov 7, 2022, 8:00 PM IST

House Demolition: ఎన్నో అక్రమ కట్టడాల కళ్ల ముందు కనిపిస్తున్నా పట్టించుకోని అధికారులు.. 50 ఏళ్లుగా ఉంటున్న తమ ఇంటిని కూల్చేసి రోడ్డున పడేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఏలూరు నగరంలోని మాదేపల్లి రోడ్డులో ఉనుకూరి వెంకటేశ్వరరావు మున్సిపాలిటీకి చెందిన మేకల కబేలా వద్ద వాచ్​మెన్​గా పని చేసేవాడు. ఉద్యోగ విరమణ తర్వాత కబేలా వద్ద.. చిన్న రేకుల షెడ్డు వేసుకొని అక్కడే తన ఐదుగురు ఆడ బిడ్డలతో జీవనం సాగిస్తున్నాడు.

గత 50 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ సిబ్బంది ముందస్తుగా ఏం చెప్పకుండా ఉన్న ఇంటిని కూల్చేశారు. దాంతో అందులో ఉంటున్న మూడు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రోడ్డు పక్కనే సామాన్లు పెట్టుకొని దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. తన భర్త ఎంతో కాలంగా ఇక్కడే పని చేసి రిటైర్ అయ్యారని తమ ఇంటిని ఇల్లు కూడా అమ్ముకొని గత్యంతరం లేక ఇక్కడే ఉంటున్నామని వాపోయారు. తమకు న్యాయం చేసి ఆదుకోవాలని అధికారులు, ప్రజా ప్రతినిధులను బాధితులు కోరుతున్నారు.

ఉన్నపళంగా ఇల్లును కూల్చేశారని వాపోతున్న బాధితురాలు
ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details