తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వీఎల్ పురం వద్ద ఓ యువకుడు కిరోసిన్ పోసుకుని ఒంటికి నిప్పంటించుకని పరుగులు తీశాడు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఘటన జరిగింది. పక్కనే వెళ్తున్న వాహనదారులు, పాదచారులు భయభ్రాంతులయ్యారు. స్థానికులు గుర్తించి వెంటనే మంటలార్పారు. యువకుడిని తిలక్ నగర్ కు చెందిన పవన్ గా గుర్తించారు. మూడొంతుల గాయాలైన యువకుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు.
నిప్పంటిచుకుని యువకుని ఆత్మహత్యాయత్నం - hospital
రాజమహేంద్రవరంలో యువకుడు ఒంటికి నిప్పంటించుకుని రహదారిపై పరుగులు తీశాడు.
నిప్పంటిచుకుని యువకుని ఆత్మహత్యాయత్నం