తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతిని నిర్వహించారు. వైకాపా నేతలు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తన పాలనతో దేశంలోనే గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డికే దక్కుతుందని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. మండపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్వహించిన వైఎస్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా 108, 104లను ప్రవేశపెట్టిన ఘనత దివంగత నేత వైఎస్ కే దక్కుతుందన్నారు. సామాన్యులకు కార్పొరేట్ వైద్యం వైఎస్ ద్వారానే లభించిందన్నారు.
'వైఎస్ ప్రజల గుండెల్లో చిరకాలం ఉంటారు' - news on ys birht anniversay
తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి నిర్వహించారు. వైకాపా నాయకులు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తూర్పు గోదావరి వైఎస్ జయంతి వేడుకలు
రాజశేఖర్రెడ్డి తెలుగు ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే రైతులను ఘనంగా సత్కరించారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి రైతుల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారని పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు.
ఇదీ చదవండి: 'ఆయన మరణం లేని మహానేత'... వైఎస్ఆర్కు సీఎం జగన్ నివాళి