ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదర్శం.. పారిశుద్ధ్య పనులు చేపట్టిన యువకులు - తూర్పుగోదావరి జిల్లా

కేంద్రపాలిత ప్రాంతం యానాంలో యువకులు స్వచ్ఛందంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. పారిశుద్ధ్య పనులు నిర్వహించే స్వచ్ఛంద సేవా సంస్థ సిబ్బంది విధులకు హాజరు కాకపోవటంతో యువకులు రంగంలోకి దిగి స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు.

yanam
స్వచ్ఛందంగా పారిశుద్ధ్య పనులు చేపట్టిన యానం యువకులు..

By

Published : Jul 8, 2020, 4:04 PM IST

ఈనెల 1వ తేదీ నుంచి యానాంలో పారిశుద్ధ్య పనులు నిలచిపోయాయి. పారిశుద్ధ్య పనులు నిర్వహించే స్వచ్ఛంద సేవా సంస్థ సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో యానాంలోని ప్రధాన విధులు, గ్రామీణ ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయింది. పరిస్థితి గమనించిన యువకులు స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 50 మంది చీపుర్లు చేతబట్టి ప్రధాన వీధులను శుభ్రం చేశారు.

యానాంలో ప్రతిరోజు ఇళ్లు, వ్యాపార సంస్థల నుంచి ఐదు టన్నుల వరకు చెత్త బయటకు వస్తుంది. దీనిని సేకరించి డంపింగ్ యార్డుకు తరలించేందుకు ప్రజా స్వచ్ఛంద సేవా సంస్థలో 300 మంది సిబ్బంది పనిచేసేవారు. పుదుచ్చేరి ప్రభుత్వం ఆ సంస్థకు 80 లక్షలు బకాయి పడింది. ఆరు నెలలుగా సిబ్బందికి జీతాలు అందలేదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సేవలను నిలిపివేశారు. నగరంలో చెత్త పేరుకుపోయింది.

డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా పుదుచ్చేరి ప్రభుత్వానికి పారిశుద్ధ్యం పరిస్థితిని వివరించడంతో 33 లక్షలు విడుదల చేశారు. పూర్తిగా బకాయిలు చెల్లిస్తే గాని తిరిగి పనులు చేపట్టేది లేదని ప్రజా సేవా సంస్థ తేల్చిచెప్పటంతో మున్సిపల్ కమిషనర్ గౌరీ సరోజా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు.

ఇదీ చదవండి'వైఎస్ ప్రజల గుండెల్లో చిరకాలం ఉంటారు'

ABOUT THE AUTHOR

...view details