తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది బీచ్లో స్నానానికి వెళ్లి ఓ యువతి మృతి చెందింది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు చెందిన మార్రె దుర్గా భవాని(15) తన తల్లితో కలిసి దసరా ఉత్సవాలకు.. తూర్పు గోదావరిలోని మలికిపురం మండలం కత్తిమండలో బంధువులు ఇంటికి వచ్చింది.
బంధువులతో కలిసి మొత్తం ఆరుగురు సభ్యులు అంతర్వేది బీచ్లో స్నానానికి వెళ్లారు. స్నానం చేస్తుండగా అలల దాటికి దుర్గాభవాని, ఆమె తల్లి, మరో చిన్నారి కొట్టుకుపోతుండగా బంధువులు వారిని ఒడ్డుకు చేర్చారు. సముద్రంలో మునిగిన దుర్గా భవాని అప్పటికే ఊపిరాడక మృతి చెందగా.. మిగిలిన ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖలో..