జగన్ వ్యక్తిగత హాజరుపై సీబీఐ కోర్టు తీర్పుపై తెదేపా నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. సీబీఐ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. జగన్ జైలుకు ఎప్పుడు వెళ్తారా అని ఆ పార్టీ నాయకులే ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. కోర్టు విచారణకు వెళ్తే రూ.60 లక్షలు ఖర్చవుతాయని చెప్పడం విడ్డూరమన్నారు. వ్యక్తిగత కేసుకు ప్రభుత్వ సొమ్ము ఎందుకు ఖర్చు చేస్తారని ప్రశ్నించారు.
జగన్ జైలుకెళ్లటం ఖాయం:తెదేపా నేత యనమల - latest news of ap cm jagan cases
జగన్ వ్యక్తిగత హాజరుపై సీబీఐ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెదేపా నేత యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్ జైలుకు వెళ్లటం ఖాయమని వ్యాఖ్యానించారు.
yanamala comments on CBI verdict on cm jagan case
ఇదీ చదవండి : జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ కొట్టివేత