తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తెదేపా ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌కు మహిళలు మద్దతుగా నిలిచారు. ఆయన విజయం కాంక్షిస్తూ నగరంలో భారీ ద్విచక్ర వాహన ప్రదర్శన చేపట్టారు. సునీల్ కార్యాలయం నుంచి జగన్నాథపురం కూడలి వరకూ ఈ ప్రదర్శన నిర్వహించారు. విద్యావంతుడైన సునీల్‌ను గెలిపించడం ద్వారా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని నినాదాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులను గెలిపించి...సమర్థ నాయకత్వానికే రాష్ట్రాన్ని అప్పగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంపీ అభ్యర్థి సునీల్ సతీమణి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది.