వారంతా పర్యటకులు..ఆహ్లద గోదావరి నది అందాలను చూసి ఆనందించాలని బోటులో బయల్దేరారు. పోలవరం మండలం సింగనపల్లి రేవు నుంచి రాయల్ వశిష్ట బోటు 62 మందితో పయనమైంది. సంతోషంగా సాగిపోతుందనుకున్న తమ ప్రయాణం విషాదంగా ముగుస్తుందని ఎవరు ఊహించలేదు. దేవిపట్నం మండలం కచులూరు వద్ద ఉదయం 10.30 గంటల సమయంలో అకస్తాత్తుగా బోటు మునకేసింది. అప్పటికే 5 లక్షల క్యూసెక్కులతో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. బోటులో పరిమితికి మించి ఎక్కించుకున్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రయాణికులంతా ఒకేసారి బోటుపైకి చేరడమూ..ప్రమాదానికి ఓ కారణంగా అధికారులు తేల్చారు.
బోటు మునిగింది.. పరిమితికి మించిన ప్రయాణికుల వల్లేనా? - latest news on boat sank at godavari
పాపికొండల్లో పెను విషాదం... 62 మందితో గోదావరిలో ప్రయాణిస్తున్న బోటు దేవీపట్నం మండలం కచులూరు వద్ద మునిగింది. ప్రయాణికులంతా బోటుపైకి ఒకేసారి చేరడమూ.. ప్రమాదానికి ఓ కారణంగా అధికారులు భావిస్తున్నారు. అసలేం జరిగింది?
ప్రమాదం ఇలా జరిగిందేమో..!
బాధితుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. హైదరబాద్, వరంగల్, వైజాగ్, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన వారున్నారు. ఇప్పటికి ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు.