తూర్పుగోదావారి జిల్లా అన్నవరంలోని పంపా రిజర్వాయర్ నుంచి తొండంగి మండలంలో ఆయకట్టుకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రిజర్వాయర్లో 95 అడుగుల నీటిమట్టం ఉండగా వాగుల ద్వారా 125 క్యూసెక్కుల నీరు చేరుతోంది. తొలుత 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, క్రమంగా నీటి విడుదలను పెంచనున్నట్లు అధికారులు తెలిపారు.
పంపా రిజర్వాయర్ నుంచి నీటి విడుదలకు ఏర్పాట్లు
అన్నవరం పంపా రిజర్వాయర్ నుంచి తొండంగి ఆయకట్టుకు నీటిని విడుదల చేసి... సుమారు 12 వేల ఎకరాలకు నీటిని అందించేందుకు రైతులతో అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు.
అన్నవరం పంపా రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేయనున్న అధికారులు