తూర్పుగోదావరిజిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో ఆరు లంకగ్రామాల మెట్టభూములలో పంటలు నిండా నీట మునిగాయి. పదిరోజులుగా పంటలు వరదనీటిలోనే మునిగి ఉండటంతో పంటలు పూర్తిగా కుళ్ళిపోయాయి. వంగ, బెండ, మిరప,కోతకు వచ్చిన సమయంలో వరదలు లంకలను ముంచటంతో రైతులు పడిన కష్టమంతా వరదపాలైనట్లు కనిపిస్తోంది. తమకు ప్రభుత్వమే ఆర్ధిక సాయం అందించిన పరిహారం చెల్లించాలని రైతులు వేడుకుంటున్నారు.
వరదలపాలైన రైతు కష్టం ! - east godavari district.
వరద ముంపు తగ్గకపోవడంతో రైతులు పరిస్థితి దినదినగండంగా మారుతోంది. కోతకొచ్చిన పంటలు నీటిలో మునిగిపోవడంతో తమ కష్టమంతా వరదలపాలైందని కన్నీరుమున్నీరు అవుతున్నారు.
vegetables crop were rotten because of flood at lanka vilalges in east godavari district.