తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం ఈవోగా వి. త్రినాథరావు భాద్యతలు చేపట్టారు. ముందుగా సత్యనారాయణ స్వామివారిని దర్శించుకుని పూజలాచరించి, వేదపండితులు ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం ప్రధానాలయంలోనే సీటీసీపై సంతకాలు చేశారు. వినాయక చవితి ఉత్సవ ఏర్పాట్లపై మొదటి సంతకం చేసి కార్యాలయానికి వచ్చి సురేష్ బాబు నుంచి భాద్యతలు స్వీకరించారు. దేవస్థానం బృహత్తర ప్రణాళిక సిద్ధం చేయడం, ట్రాఫిక్ నియంత్రణ, అన్నదానం, వ్రతాలు, వసతి తదితర అన్ని సమస్యలపై దృష్టి సారించి అభివృద్ధి చేస్తానని తెలిపారు.
అన్నవరం ఈవోగా వి. త్రినాథరావు భాద్యతలు స్వీకరణ - annavaram
అన్నవరం సత్యనారయణ స్వామివారి ఆలయ ఈవోగా వి. త్రినాథరావు భాద్యతలు చేపట్టారు. దేవస్థాన అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
అన్నవరం ఈవోగా వి. త్రినాథరావు భాద్యతలు స్వీకరణ