తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ చేపలరేవులో లభ్యమవుతున్న పీతలు ఇక్కడి నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. నిత్యం ఈ రేవులో భారీస్థాయిలో పీతలు లభ్యమవడంతో పలు కంపెనీలు ఏజెంట్ల ద్వారా వీటిని అమెరికాకు ఎగుమతి చేస్తున్నారు. రేవులోనే భారీ గిన్నెల్లో ఈ పీతలను ఉడకబెట్టి వాటిని మద్రాస్, విశాఖ ప్రాంతాలలోని కంపెనీలకు ఎగుమతి చేస్తారు. ఇలా చేయడం ద్వారా పీతలు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయని మత్స్యకారులు తెలిపారు.
ఉప్పాడ పీత.. అమెరికా బాట - ఉప్పాడ చేపలరేవు
తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ చేపలరేవులో లభించే పీతలు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. దీంతో ఉప్పాడ పీతలకు అదే స్థాయిలో గిరాకీ బాగా పెరుగుతోంది. ఈ పీతలను ఉడకబెట్టడం ద్వారా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయని మత్స్యకారులు చెబుతున్నారు. అందువల్ల సులభంగా ఎగుమతి చేసుకోవచ్చని వారు తెలిపారు.
ఉప్పాడ పీత
పీతలను కొనుగోలు చేసిన కంపెనీలు అవసరమయ్యే గుజ్జును తీసి మిగతా భాగాన్ని అమెరికాకు ఎగుమతి చేస్తారు. అంతర్జాతీయంగా ఈ పీతలకు గిరాకీ పెరుగుతోంది.
ఇదీ చదవండి: వయసు మూడేళ్లు... ఎత్తు ఆరడుగులు!