BOY DIED DUE TO ELECTRIC SHOCK : విద్యుదాఘాతంతో రెండు కాళ్లు కోల్పోయి.. 14 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దర్శిత్ చివరికి మృత్యుఒడికి చేరాడు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పైడిమెట్టకు చెందిన జొన్నకూటి దర్శిత్(3) ఈరోజు సాయంత్రం మృతి చెందాడు.
మృత్యు ఒడిలోకి చేరిన చిన్నారి దర్శిత్.. - east godavari latest news
18:13 November 25
బాలుడి స్వస్థలం తూ.గో. జిల్లా తాళ్లపూడి మండలం
ఈ నెల 12న తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పైడిమెట్టలో దర్శిత్ (3) ఇంటిపై ఆడుకుంటూ 33కేవీ విద్యుత్తు లైన్ కారణంగా విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. అదేరోజు కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. బాలుడి రెండు కాళ్లకు తీవ్రగాయాలై ఇన్‌ఫెక్షన్ సోకడంతో మోకాలి కింది వరకు తొలగించారు. అయినప్పటికీ ఇన్‌ఫెక్షన్ తగ్గకపోవడంతో కుడికాలులో మరికొంతభాగం (మోకాలుపై వరకు) నేడు శస్త్రచికిత్స చేసి తొలగించారు. తర్వాత వార్డుకు తరలించిన కొద్దిసేపటికే గుండె కొట్టుకుపోవడం నెమ్మదించి మృతిచెందాడని వైద్యులు తెలిపారు. 14రోజులు మృత్యువులో పోరాడి బాలుడు శుక్రవారం మృతి చెందడంతో పైడిమెట్ట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
సంబంధిత కథనం:చిన్నా... ఏవిరా నీ కాళ్లు
ఇవీ చదవండి: