తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. నల్ల వంతెన సమీపంలోగల ఒంటెద్దు సూర్య నారాయణ వీధిలోని బద్రిమణి కుటుంబం హైదరాబాద్కు వెళ్లింది. ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తాళం బద్దలు కొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. చుట్టుపక్కల వారు ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి.. వారికి సమాచారం అందించారు. ఎంత మొత్తం చోరీకి గురైందన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.
ఇంట్లో ఎవరూ లేనిది చూసి.. దోచేశారు! - అమలాపురం వార్తలు
తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురంలో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఎవరూ లేని విషయాన్ని గుర్తించిన దొంగలు.. ఇంట్లో పడ్డారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అమలాపురంలో ఓ ఇంట్లో చోరీ