తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వరి పండించే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. కురుస్తున్న వర్షాలు రైతులను నట్టేటముంచాయి. నాలుగు మండలాల్లో యాభై వేల ఎకరాల్లో వరి పండించే రైతులు.. ఇప్పటికే వరినాట్లు పూర్తి చేశారు. మొదటి దశ కలుపు తీయించి ఎరువులు వేశారు. ఒకటి, రెండురోజుల్లో నీరు తగ్గుతుందని ఆశించినా.. ఎంతకూ తగ్గటం లేదు. బందరు కాలువ ఆక్రమణలకు గురి కావటం, గురపుడెక్క ఇతర వ్యర్థాలతో వరి చేళ్ల నుంచి నీరు దిగే అవకాశం లేకపోవడంతో పోలాలు నీటిలోనే నానుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
నీట మునిగిన పంటలు..రైతుల ఆవేదన
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వరి పండించే రైతులను నెలలోపే నట్టేట ముంచాయి.
నీట మునుగుతున్న పంటలు..రైతుల ఆవేదన