ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు తెదేపాని వీడినా పార్టీకి వచ్చిన నష్టం లేదని.. ఇన్నాళ్లూ ఆయన ప్రధాన అనుచరులుగా ఉన్నకార్యకర్తలు చెప్పారు. సుబ్బారావు వెంట తాము నడిచేది లేదని.. తమకు పార్టీనే ప్రధానమని చెప్పారు.తెదేపా అభ్యర్థి వరుపుల రాజాతోనే కొనసాగుతామని తేల్చారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలో ఏలేశ్వరం జడ్పీటీసీ జ్యోతుల పెదబాబుతో పాటు... ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఛైర్మన్ కొప్పన వెంకటేశ్వరావు.. తమ అనుచరులతో కలిసి రాజాకి మద్దతు తెలిపారు. అనంతరం వొమ్మంగి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వరుపుల రాజా మాట్లాడుతూ...నియోజకవర్గరైతులకు సాగునీటి సమస్యలు లేకుండా చేస్తానన్నారు.
ఆయన వెళ్లినా... మేము తెదేపాతోనే ఉంటాం! - తూర్పుగోదావరి జిల్లా
శాసనసభ్యులు వరుపుల సుబ్బారావు తెదేపాని వీడినా... తాము తెదేపాతోనే కొనసాగుతామని ఆయన అనుచరులు చెప్పారు.
'తెదేపాతోనే ఉంటాం'