ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Rains: భరోసా ఇవ్వని ప్రభుత్వం.. మేమున్నామని ధైర్యం చెప్పిన టీడీపీ - untimely rains in ap

TDP Raithu Committee:తూర్పు గోదావరి జిల్లాలో తెలుగు దేశం నేతలు పర్యటించారు. వరదల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించారు. రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. సంచులు అరకొరగా ఇచ్చిన రవాణా సదుపాయాలు లేక బస్తాల్లోనే ధాన్యం తడిసిపోయినట్లు టీడీపీ నేతలకు రైతులు వివరించారు

tdp leaders
తెలుగు దేశం పార్టీ నేతలు

By

Published : May 3, 2023, 9:03 PM IST

Updated : May 3, 2023, 9:14 PM IST

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు స్టీరింగ్ కమిటీ పర్యటన

TDP State Farmer Committee: తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు స్టీరింగ్ కమిటీ పర్యటించింది. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను పరామర్శించి, తడిసిన ధాన్యాన్ని, ధాన్యపు బస్తాలను పరిశీలించారు. పరిశీలన కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి కేఎస్ జవహర్, రాజమహేంద్రవరం గ్రామీణ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ శాసన సభ్యులు బూరుగుపల్లి శేషారావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జ్యోతుల నెహ్రూ తదితర నాయకులు పాల్గొన్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం మిల్లులకు సరఫరా చేయటానికి వీలుగా సిద్ధం చేసినా సంచుల సరఫరా కాక లారీలు ఏర్పాటు చేయక ధాన్యం తడిచి నష్టపోయామని రైతులు పేర్కొన్నారు. సంచులు అరకొరగా ఇచ్చిన రవాణా సదుపాయాలు లేక బస్తాల్లోనే ధాన్యం తడిసిపోయినట్లు రైతులు వివరించారు.

నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యం వల్ల రైతులు నష్టపోలేదని, కేవలం జగన్మోహన్ రెడ్డి అసమర్థ విధానాల వల్ల రైతులు నష్టపోయారని ఆరోపించారు. ధాన్యం కోసిన తర్వాత వారం రోజులు గడిచినా కూడా కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గడిచిన రెండు, మూడు రోజులుగా తమ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బందులను రైతులు ఏకరూ పెడుతున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు పంట నష్టపోయిన రైతులకు భరోసాగా నిలవడానికి వారి తరఫున ప్రభుత్వంతో పోరాటానికి తమను పంపించారని శ్రీనివాస్ రెడ్డి వివరించారు.

రాజమండ్రి గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని మిల్లులకు తీసుకెళ్లినప్పుడు డబ్బులు చెల్లించి అమ్ముకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి దుర్భర పరిస్థితులు దేశంలోని మరే రాష్ట్రంలో లేదని పేర్కొన్నారు. నిడదవోలు మాజీ శాసనసభ్యులు మాట్లాడుతూ నష్ట పోయిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అకాల వర్షాలు వల్ల తడిసిపోయినా, మొక్కలు వచ్చినా కుళ్ళిపోయినా ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్టీఆర్ జిల్లా: మైలవరం మైలవరం మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తడిచిన ధాన్యం,మొక్కజొన్న మద్దతు ధరకు కొనాలని జాతీయ రహదారిపై టీడీపీ నేత దేవినేని ఉమా బైఠాయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఉమాని అదుపులోకి తీసుకుని జీపు ఎక్కించడానికి ప్రయత్నిస్తుండగా.. టీడీపీ కార్యకర్తలు, రైతులు జీప్​కు అడ్డంగా ఉండి నిరసనకు దిగారు. పోలీసులను తోసుకుంటూ నినాదాలు చేపట్టడంతో పాటు కార్యకర్తలు జీపుని కదలనివ్వలేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పోలీసుల మధ్య పెనుగులాట చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

పల్నాడు జిల్లా: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతే.. సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్​లో మొద్దు నిద్రపోతున్నాడని మాజీ మంత్రి, పత్తిపాటి పుల్లారావు విమర్శించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట, నాదెండ్ల మండలాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంటలను ప్రత్తిపాటి పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలకు మిర్చి, మొక్కజొన్న, వరి తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. రైతులను పట్టించుకోవాల్సిన వ్యవసాయ మంత్రి కనిపించని పరిస్థితి నెలకొంది అన్నారు. వర్షాలకు మిర్చి, మొక్కజొన్న పూర్తిగా దెబ్బతిన్నదని.. మిర్చి క్వింటాలు రూ20వేల నుంచి రూ25 వేలు అమ్ముకోవాల్సిన రైతులు ప్రస్తుతం రూ 10 నుంచి రూ15 వేలకు విక్రయించుకోవలసిన దుస్థితి ఏర్పడిందన్నారు.


ఇవీ చదవండి:

Last Updated : May 3, 2023, 9:14 PM IST

ABOUT THE AUTHOR

...view details