తూర్పుగోదావరి జిల్లా మమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశాన్ని మురమండ గ్రామంలో నిర్వహించారు. తెదేపా నేత మాజీ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఈమధ్య జరిగిన ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓటమికి గల కారణాలను మండలాల వారీగా విశ్లేషించుకున్నారు. ఎవరు అధైర్యపడకుండా రానున్న మండల పరిషత్, జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కృషిచేసి పార్టీ విజయానికి పాటుపడాలని తీర్మానించారు.
తెదేపా నియోజకవర్గ సమన్వయ సమావేశం - east godavari
తూర్పుగోదావరి జిల్లా మురమండలో తెదేపా నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు.
తెదేపా