తూర్పుగోదావరిజిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కె.గంగవరం మండలంలోని గ్రామాల్లో పేదలకు తెదేపా నేతలు సహాయం అందించారు. పార్టీ సీనియర్ నాయకులు చొల్లంగివెదుర్లయ్య, శీరెడ్డి సత్తిబాబు ఆధ్వర్యంలో కూరగాయలు, మాస్కులు, కోడిగుడ్లు, అరటిపండ్లు పంపిణీ చేశారు. విపత్కర సమయాల్లో పేదలకు సాయపడాలన్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు గత 13 రోజులుగా నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నట్టు వారు తెలిపారు.
రామచంద్రాపురంలో పేదలకు నిత్యావసరాల పంపిణీ - CORONA
లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు తెదేపా నేతలు సహాయం అందించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కె.గంగవరం మండలంలోని వివిధ గ్రామాల్లో తెదేపా సీనియర్ నాయకులు పేద ప్రజలకు కూరగాయలు, మాస్కులు, కోడిగుడ్లు, అరటిపండ్లు పంపిణీ చేశారు.
నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న తెదేపా నేతలు