సుబ్రమణ్య షష్ఠిని పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావడి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సుబ్రమణ్య మాలధారులు భుజాన కావడి ధరించి గ్రామోత్సవంలో పాల్గొన్నారు. వల్లీ దేవసేన సమేత సుబ్రమణ్యేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను గజ వాహన రథంపై ఊరేగించారు. ఈ వేడుకల్లో మహిళలు, చిన్నారుల కోలాటం ఆకట్టుకుంది. తమిళనాడులో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ ఉత్సవాన్ని అనపర్తిలో ఏడేళ్లుగా నిర్వహిస్తున్నారు.
ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావడి ఉత్సవం - తూర్పుగోదావరి జిల్లా
తమిళనాడులో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఉత్సవాన్ని అనపర్తిలో ఏడేళ్లుగా నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావడి ఉత్సవాన్ని వైభవంగా జరిగింది. వల్లీ దేవసేన సమేత సుబ్రమణ్యేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను గజ వాహన రథంపై ఊరేగించారు.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావడి ఉత్సవం