రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయ్యాలంటూ,అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు.ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని,విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేశారు.వసతి గృహ విద్యార్థులకు కాస్మోటిక్స్,మెస్ ఛార్జీలను వెంటనే చెల్లించి మెరుగైన వసతులు కల్పించాలని ఏబీవీపీ నేతలు అన్నారు.పాఠశాలలు,కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని పేర్కొన్నారు.విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని,లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్ధుల ధర్నా
ఫీజు రీయింబర్స్మెంట్ ను వెంటనే విడుదల చెయ్యాలంటూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు.
విద్యార్థులు ధర్నా