ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఈనాడు'లో వచ్చిన కవిత... బాల సుబ్రహ్మణ్యం నోట పాటై..! - corona latest news

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేయాలని ప్రభుత్వాలు, ప్రజలు నిత్యం పోరాటం చేస్తున్నారు. పలువురు ప్రముఖులు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో 'రామోజీ ఫౌండేషన్‌' కరోనాపై కదనం’ పేరుతో కవితల పోటీ నిర్వహిస్తోంది. ఈనెల 3వ తేదీ ఉదయం 9గంటల వరకూ వచ్చిన కవితల్లో 'మనిషిని నేను' అనే కవిత... ఉత్తమ కవితగా ప్రథమ బహుమతి అందుకుంది. శనివారం 'ఈనాడు' ప్రధాన సంచికలో ప్రచురితమైన ఈ కవితను ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహణ్యం పాటగా ఆలపించి ఆడియోను పంచుకున్నారు.

sp balasubrahmanyam sing a song on corona
బాలసుబ్రహ్మణ్యం

By

Published : Apr 4, 2020, 4:37 PM IST

Updated : Apr 4, 2020, 7:42 PM IST

ఎస్పీ బాల సుబ్రహణ్యం పాట

పొద్దున్నే అలవాటు ప్రకారం 'ఈనాడు' చదువుతున్నాను. రెండో పేజీలోకి రాగానే, ‘మనిషిని నేను’ అంటూ అమలాపురానికి చెందిన తంగెళ్ల రాజగోపాల్‌ రాసిన కవితకు ప్రథమ బహుమతి వచ్చింది. ఒకసారి చదివాను. ఎందుకో పాడుకోవాలనిపించింది. ఎవరైనా వింటారని కాదు... వినాలని కాదు... నాకు అనిపించింది. అందుకే పాడుతున్నా. శ్రుతి, లయ ఏవీ లేవు. చేతిలో సెల్‌ఫోన్‌ మాత్రమే ఉంది. మా కుక్క పిల్లలు కూడా అరవొచ్చు. కాకపోతే నా చుట్టుపక్కల ట్రాఫిక్‌, ఇతర శబ్దాలు లేవు. కనీసం నాకోసం నేను పాడా. -ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం

Last Updated : Apr 4, 2020, 7:42 PM IST

ABOUT THE AUTHOR

...view details