ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమానుషం: తల్లిని హతమార్చిన కుమారుడు.. సహకరించిన భార్య - తూర్పుగోదావరిలో భార్యతో కలిసి కన్న తల్లిని చంపేశాడు

కన్న పేగును మరిచాడు. నవమాసాలు మోసి, కని, పెంచిన తల్లిని... కట్టుకున్న భార్యతో కలిసి దారుణంగా చంపేశాడు. ఆస్తికోసం ఘాతుకానికి ఒడిగట్టాడు. కన్న తల్లిని హత్యచేసి ఇప్పుడు భార్యతో కలిసి పరారయ్యాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రౌతుపాలెంలో జరిగింది.

son-killed-his-mother-in-east-godavari
son-killed-his-mother-in-east-godavari

By

Published : Mar 21, 2020, 3:15 PM IST

Updated : Mar 21, 2020, 3:47 PM IST

భార్యతో కలిసి కన్న తల్లిని హతమార్చిన కుమారుడు

భార్యతో కలిసి కన్న తల్లిని కుమారుడు హతమార్చిన ఘటన....తూర్పుగోదావరి జిల్లా రౌతుపాలెంలో కలకలం సృష్టించింది. ఆస్తి తగాదాల కారణంగా కుమారుడు శ్రీనివాస్.. తల్లిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. కర్రతో వృద్ధురాలిని బలంగా బాదగా.. ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు దర్యాప్తులో తేల్చారు. ఘటన జరిగిన అనంతరం భార్యాభర్తలిద్దరూ పరారైనట్లు పోలీసులు తెలిపారు.

Last Updated : Mar 21, 2020, 3:47 PM IST

ABOUT THE AUTHOR

...view details