సామాజిక దూరం పాటించడం వల్ల కరోనా వైరస్ను నియంత్రించవచ్చని తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. పట్టణంలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కూరగాయల విక్రయ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు.
'సామాజిక దూరమే కరోనా నివారణకు మందు' - corona effect on people
శరవేగంగా వ్యాపిస్తూ ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడానికి ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి అన్నారు.
రంపచోడవరంలో ఎమ్మెల్యే ధనలక్ష్మి పర్యటన