ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

6 లక్షలు దాచాడు... పేదోడిగా మరణించాడు!

నా అనే వాళ్లు ఉన్నప్పటికీ కొన్ని కారణాలతో వారికి దూరంగా ఒంటరిగా జీవించాడు. 30 ఏళ్లు ఓ పాడుబడిన ఇంట్లోనే కాలం గడిపాడు. దానాలు తీసుకోగా వచ్చిన సొమ్మును మూటల్లో దాచాడు. కానీ వాటిని ఖర్చు చేయకుండానే మరణించాడు. అతని ఇంట్లో డబ్బు మూటలను గుర్తించి స్థానికులు లెక్కించగా ఆరు లక్షలుగా తేలింది.

డబ్బు

By

Published : Aug 29, 2019, 11:21 PM IST

తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో ఓ పాత భవనంలో ఒంటరిగా నివాసముంటూ మృతి చెందిన పురోహితుడి ఇంట్లో దొరికిన సొత్తు లెక్క తేలింది. ఆ బ్రాహ్మణుడు దాచిన డబ్బును లెక్కించగా సుమారు రూ. 6 లక్షలు ఉందని సమాచారం. డబ్బు కట్టల్లో చాలా నోట్లు పాడైపోయాయి. నాణేలు మట్టిలో కలిసిపోవడంతో జల్లెడ పట్టి వేరు చేశారు. దాదాపు 30 ఏళ్లుగా ఆ కూలిన ఇంట్లోనే ఒంటరిగా జీవించాడు. తీరా అతను చనిపోయిన తర్వాత ఇంట్లో నగదు మూటలు బయట పడ్డ విషయం తెలిసిందే. ఈ సొమ్మును అంత్యక్రియలు, ఆ తర్వాతి కార్యక్రమాలకు వినియోగించాలని స్థానికులు, బ్రాహ్మణ సంఘాలు నిర్ణయించాయి. మిగిలిన మొత్తాన్ని ఏమి చేయాలన్న దానిపై ఆలోచిస్తున్నాయి.

మరణించిన బ్రాహ్మణుడి ఇంట్లో దొరికిన సొత్తు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details