ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వయసు మూడేళ్లు... ఎత్తు ఆరడుగులు!

తూర్పు గోదావరి జిల్లాలో ముర్రాజాతికి చెందిన ఓ దున్నపోతు... ఆరడుగుల ఎత్తుతో అందర్నీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం దున్నపోతు వయసు మూడేళ్లు కాగా, ఎత్తు ఆరడుగులుగా యజమాని చెబుతున్నాడు.

By

Published : Dec 22, 2020, 7:46 AM IST

six-feet-buffalo-in-east-godavari-district
తూర్పుగోదావరి జిల్లాలో ఆరడుగుల దున్నపోతు

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడికి చెందిన కుసుమ వినోద్‌ పెంచుతున్న ముర్రా జాతికి చెందిన దున్నపోతు... ఆరడుగుల ఎత్తుతో ఆకట్టుకుంటోంది. ఇది వారింట్లో ఉండే ఓ గేదెకు పుట్టగా.. అపురూపంగా సాకుతున్నారు. ప్రస్తుతం దున్నపోతు వయసు మూడేళ్లు కాగా, ఎత్తు ఆరడుగులు.

ఈ దున్నపోతుకు రోజూ రూ.1000 విలువచేసే దాణా పెడుతున్నారు. అయిదు కిలోల ఉలవలు, 5 కిలోల గంట్లు ఉడకబెట్టి అందిస్తారు. పావు కిలో ఖర్జూరంతో పాటు నువ్వులు తాటిబెల్లం మిశ్రమాన్ని పెడుతున్నారు. వీటితోపాటు ఒక లీటరు ఆవుపాలు, నాలుగు కొబ్బరి బొండాల నీరు తాగిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం అయిదు కిలోమీటర్ల మేర నడిపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details