పొగాకు రైతుల ఆదాయం పెంపుకు అవలంబిచాల్సిన విధానాలపై రెండు రోజుల సదస్సు రాజమహేంద్రవరం సీటీఆర్ఐ లో ప్రారంభమైంది. బెంగళూరు జీకేవీఆర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి శివన్న ముఖ్య అతిధిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలు పాల్గొని రైతులతో చర్చించి తగు విధివిధానాలను రూపొందించనున్నారు. పొగాకులో దిగుమతి నష్టాలను తగ్గించడంతోపాటు ఉత్పాదకతను పెంచి రైతుల ఆదాయం పెంపొందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఉత్పాదకత పెంచడానికి శాస్త్రవేత్తలు అందించే సలహాలు, సూచనలు రైతులు పాటించాలని శివన్న తెలిపారు. తగిన ప్రణాళికను తయారుచేసి అమలుకు కృషి చేస్తామని ఇండియన్ సొసైటీ ఆఫ్ టొబాకో సైన్స్ అధ్యక్షుడు దామోదర్ చెప్పారు.
పొగాకు రైతుల ఆదాయం పెంపుపై రెండు రోజుల సదస్సు - east godavari
పొగాకు రైతుల ఆదాయం పెంచటానికి అమలు చేయాల్సిన విధానాలపై రాజమహేంద్రవరం సీటీఆర్ఐలో రెండు రోజుల సదస్సు ప్రారంభమైంది.
పొగాకు సదస్సు