Marijuana: అక్రమంగా తరలిస్తున్న 1,730 కేజీల గంజాయిని తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు బూరుగు పూడి వద్ద జాతీయ రహదారిపై పోలీసులు నిఘా పెట్టారు.
Marijuana: 1730 కేజీల గంజాయి పట్టుకున్న పోలీసులు - Marijuana
Marijuana: గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న 1,730 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా బూరుగు పూడి వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.
గంజాయి
ఈ క్రమంలో.. ఎదురుగా వచ్చిన రెండు వ్యానులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా.. వాటిలో 40 బస్తాల గంజాయి బయటపడింది. ఈ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సరుకు విలువ రూ.కోటి 75 లక్షల మేర ఉంటుందని పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాస్ తెలిపారు. అయిదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. మరో ఇద్దరి కోసం వెతుకుతున్నామని చెప్పారు.
ఇదీ చదవండి:COUPLE DIED IN VISAKHAPATNAM: కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసిన భర్త.. ఆ తరువాత తానూ..