తూర్పుగోదావరి జిల్లాలో రూ.3 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం - ఏపీ క్రైమ్ వార్తలు
09:48 August 10
గంజాయి స్వాధీనం
తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం వేటుకూరు కూడలి పెద్ద మొత్తంలో గంజాయి పట్టుకున్నారు. విశాఖ జిల్లా దబ్బకోట నుంచి మారేడుమిల్లి ఘాట్ రోడ్డు మీదుగా తెలంగాణకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. 3వేల 399 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 3కోట్ల రూపాయలని తెలిపారు. ఒడిశా, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన 12 మందిని అరెస్టు చేశామని, పలు వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఇదీ చదవండి: చేనేతల ఖాతాల్లోకి.. వైఎస్సార్ నేతన్న నేస్తం నిధులు