రాష్ట్రంలోని దేవాలయాల్లో జరుగుతున్న పలు సంఘటనలతో.. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులు నిర్ణయించారు. పోలీసు, దేవస్థానం భద్రతా విభాగ అధికారులలో ఆలయ ఈవో త్రినాథరావు సమీక్షించారు. ఆలయంలో ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాలు, అదనంగా ఏ ఏ ప్రదేశాల్లో ఎన్ని ఏర్పాటు చేయాలి, తనిఖీ, దత్తత దేవాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు, కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.
అన్నవరం దేవస్థానంలో భద్రత మరింత కట్టుదిట్టం - అన్నవరం ఆలయ ఈవో త్రినాథరావు వార్తలు
దేవాలయాలపై జరుగుతున్న దాడులతో.. .. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ విషయాలపై పోలీసు, దేవస్థానం భద్రతా విభాగ అధికారులలో ఆలయ ఈవో త్రినాథరావు సమీక్షించారు.
అన్నవరం దేవస్థానంలో భద్రత మరింత కట్టుదిట్టం