ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యానాంలో మోగిన బడి గంటలు - school

కేంద్రపాలిత ప్రాంతం యానాంలో వేసవి సెలవుల అనంతరం ఈ రోజు పాఠశాలలు ప్రారంభమయ్యాయి. పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు కొత్తగా పాఠశాలలో చేరే విద్యార్థులచే అక్షరాభ్యాసం చేయించారు

యానాంలో మోగిన బడి గంటలు

By

Published : Jun 20, 2019, 4:05 PM IST

యానాంలో మోగిన బడి గంటలు

కేంద్రపాలిత ప్రాంతం యానాంలో వేసవి సెలవుల అనంతరం ఈ రోజు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఏపీలో గతవారమే పాఠశాలలు తెరవగా... ఎండలు అధికంగా ఉన్నందున.. సెలవులు వారం రోజులు పొడిగించారు. ఈ రోజు ఉదయం చిరుజల్లుల పడుతుండగా... ఆహ్లాదకర వాతావరణంలో పిల్లలు ఉత్సాహంగా పాఠశాలలకు హాజరయ్యారు.

పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు, యానాం డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మేన, ప్రాంతీయ విద్యాశాఖాధికారి సాయినాథ్ కొత్తగా పాఠశాలలో చేరే విద్యార్థులచే అక్షరాభ్యాసం చేయించారు. ఉన్నత తరగతులలో చేరినవారికి పాఠ్య పుస్తకాలు అందజేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details