ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మాలల హక్కుల సాధన కోసం లక్ష మందితో సమావేశం'

రాష్ట్రంలో మాలల్ని ఏ రంగంలోనూ రానివ్వకూడదని... మాదిగ ప్రజాప్రతినిధులు సామాజిక మాధ్యమంలో పోస్ట్ పెట్టడంపై, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ కారెం శివాజీ మండిపడ్డారు. ప్రభుత్వం ఈ విషయంపై సీబీ సీఐడీతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

By

Published : Nov 18, 2020, 4:52 PM IST

sc st commission ex chairman karam shivaji speaks about mala community facing problems
'మాలల హక్కుల సాధన కోసం లక్ష మందితో సమావేశం'

రాష్ట్రంలో మాలల్ని ఏ రంగంలోనూ రానివ్వకూడదని... మాదిగ ప్రజాప్రతినిధులు సమావేశం నిర్వహించి సామాజిక మాధ్యమంలో పోస్ట్ పెట్టడంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ కారెం శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఎం జగన్ సీబీ సీఐడీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఇలాంటి పరిణామాలపై.. మాలలు బాధపడుతున్నట్టు... మాలల హక్కుల సాధన కోసం త్వరలోనే లక్ష మందితో సమావేశం నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. దళితులపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details