తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మంగళవారుపేటలోని కంటైన్మెంట్ జోన్‌లో ఉన్నవారికి పలువురు దాతలు బాసటగా నిలుస్తున్నారు. సత్యగోపీనాథ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న పేదవారికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. వాటితో పాటు ఒంటరిగా బతికేవారు, భిక్షాటన చేసేవారికి నిత్యం ఆహారం అందజేస్తున్నారు. ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలని ట్రస్ట్ ఛైర్మన్ సత్యగోపీనాధ్ కోరారు.
సత్యగోపీనాథ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ - satyagopinath trust vegetables distribution news in rajahmundry
లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న పేదవారిని ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. రాజమహేంద్రవరంలోని మంగళవారపుపేటలో సత్యగోపీనాథ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
సత్యగోపీనాథ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ