సంక్రాంతి ముగింపు సంబరాలు కాకినాడ సాగర తీరంలో ఆహ్లాదంగా సాగాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పర్యాటకులతో సాగరతీరం కళకళలాడింది. కుటుంబ సమేతంగా స్నేహితులతో బృందాలుగా వచ్చిన వారంతా ఆనందంగా గడిపారు. తెల్లవారుజాము నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పర్యాటకులతో సాగరతీరం కిక్కిరిసింది. పిల్లలు పెద్దలు సాగర తీరంలో సరదాగా గడిపారు. కిక్కిరిసిన జనంతో సముద్ర స్నానానికి జనం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కళకళలాడిన సాగర తీరం..జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన పర్యాటకులు - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు
సంక్రాంతి ముగింపు సంబురాలు కాకినాడ సాగర తీరంలో ఘనంగా జరిగాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో జనం సాగర తీరానికి తరలివచ్చారు. చిన్నా,పెద్ద తేడా లేకుండా ఆనందంగా గడిపారు.
సాగర తీరంలో సంక్రాంతి ముగింపు సంబురాలు
కాకినాడ తీరం నుంచి సూర్యారావు పేట వరకు సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది.
ఇదీ చదవండి:కరోనా వ్యాక్సినేషన్‌పై సైకత శిల్పం రూపకల్పన