సంక్రాంతి వస్తే పల్లెకు ప్రాణం వస్తుంది. పిండి వంటలు, కొత్త బట్టలు, ధాన్యపురాసులు, బంధువుల సందడి... ఇలా ప్రతి అంశం కొత్త శోభ తీసుకొస్తాయి. వలస వెళ్లిన జనాలతో ఒంటరితనం అనుభవించే గ్రామాలు...పండుగకు మాత్రం మురిసిపోతాయి. మూడు రోజులు జరిగే వేడుక ఒక ఎత్తైతే... కోళ్ల పందేలు మరో ఎత్తు. వీటి ప్రత్యేకత వేరేగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఆటలో రెండు కోళ్లు తలపడుతుంటే పక్కనే ఉన్న జనం చప్పట్లతో ఉత్సాహపరుస్తుంటారు. అలాంటి కోళ్లు రెండు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో ఓ సారి చూద్దాం...
మావాడికి మీసాల్లేవు గాని పౌరుషానికి కోళ్ల పందేలట! - సంక్రాంతి కోళ్ల పందేలు న్యూస్
పందెం కోడికి మాటలొస్తే ఎలా ఉంటుంది. తాను రాజభోగాలు అనుభవిస్తున్నాననే భ్రమ వీడి... బరిలో దిగాల్సి వస్తే ఆ కోడి ఏం చేస్తుంది.
sankranthi cock fight