ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తూర్పుగోదావరి జిల్లాలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా - atreyapuram sand trafficking latest news update

ఇంటికే ఇసుక అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా... అమలులో మాత్రం చిత్తశుద్ది కనిపించడం లేదు. ప్రభుత్వం అధీనంలో ఉన్న ఇసుక ర్యాంపుల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టలేకపోతుంది. పైనుంచి ఉత్తర్వులు వస్తున్నా.. అమలు చేయకుండా క్రిందిస్థాయి ఉద్యోగులు తూట్లు పొడుస్తుండటంతో అవినీతి యథేచ్ఛగా కొనసాగుతోంది.

Sand trafficking at atreyapuram
యాథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

By

Published : Feb 3, 2020, 1:33 PM IST

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

నదీగర్భంలో కేవలం జట్టు కూలీలు మాత్రమే తవ్వకాలు జరిపి ట్రాక్టర్ల‌పై స్టాకు పాయింట్‌కు తీసుకుని రావాలి. కనీసం లారీలు కూడా లోపలికి రాకూడదు. అలాంటిది అయిదు యూనిట్ల పెద్ద లారీలు వెళ్లి యంత్రాలతో ఇసుక తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో... ఇసుక పాత విధానంలో వచ్చిన బుకింగ్‌లను వెంటనే పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇదే అదునుగా కొందరు అక్రమ తవ్వకాలు చేపట్టారు. దీంతో జట్టు కూలీలు ఈ అక్రమ రవాణాలను అడ్డుకున్నారు. ఇసుకను యంత్రాలతో తవ్వి తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ర్యాంపులో ఉన్న ఏపీఎండీసీ అధికారులు పట్టించుకోకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. స్థానికి పోలీసులకు ఫోన్‌ చేస్తే.. ఇసుక ర్యాంపుల్లో కార్యకలాపాలన్నీ అక్కడ అధికారులు చూసుకుంటున్నారని సమాధానం ఇవ్వడం ఇసుక అక్రమ రవాణా తీరును తెలియజేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details