ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక తవ్వకాల దందా @ లాభాలే లక్ష్యంగా.. నిబంధనలకు విరుద్ధంగా! - రాజమహేంద్రవరం-ధవళేశ్వరం మధ్య ఇసుక మాఫియా

ఘరానా దొంగలు.. గుడినే కాదు గుడిలో లింగాన్నీ మింగేస్తారని... అంటూ ఉంటాం. ఇసుకాసురులు ఇప్పుడు అలాగే తయారయ్యారు. నది రేవుల్లోనే కాదు.. నదీగర్భాన్నీ ఇష్టారాజ్యంగా తోడేస్తున్నారు. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా..... దాదాపు 30 అడుగుల లోతు వరకూ డ్రెడ్జింగ్ చేస్తున్నారు. అది మరెక్కడోకాదు. ఉభయ గోదావరి జిల్లాల వరదాయిని కాటన్ బ్యారేజీకి కనుచూపు మేరలోనే!

sand Mafia at Rajamahendravaram- Dhavalesvaram Barrage, East Godavari District
ఇసుక అక్రమార్కుల దొంగదారి... లాభాలకు దారి

By

Published : Jul 3, 2020, 3:00 PM IST

ఇసుక అక్రమార్కుల దొంగదారి... లాభాలకు దారి

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం - ధవళేశ్వరం మధ్య.. గాయత్రి - 1 నుంచి గాయత్రి - 4 వరకు ఇసుక రేవులు ఉన్నాయి. ఈ ర్యాంపులు సొసైటీల ఆధీనంలో ఉన్నాయి. వీరి వద్ద వందల సంఖ్యలో ఉండే జట్టు కూలీలు నదిలో మునిగి బకెట్లతో..... ఇసుకను తోడుతారు. దాన్ని పడవల్లో నింపి ర్యాంపునకు చేరవేస్తారు. అక్కడ ఉన్న కూలీలు.... నావల్లో నుంచి ఇసుకను ఒడ్డుకు దించుతారు. గోదావరి తీరంలో ఈ విధానం... అనాదిగా జరుగుతోంది.

అదును చూసి అక్రమాలు... డీజిల్ ఇంజిన్లతో ఇసుక తవ్వకాలు

నదిలో నుంచి బకెట్లలో ఇసుక తోడే విధానాన్ని ఇసుకాసురులు.. ఓ పెద్ద దందాగా మార్చేశారు. తప్పుడు దారిలో ఇసుకను అప్పనంగా దోచేస్తున్నారు. డీజిల్ ఇంజిన్ల ద్వారా... పడవలకు గొట్టాలు అమర్చి, మోటారు ఇంజన్ల సాయంతో నది మధ్యలో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. కాటన్ బ్యారేజీకి రెండు కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న ఈ వ్యవహారంపై.... ఈటీవీ భారత్​కు సమాచారం అందింది. నదిలో ప్రయాణించి ఆ దృశ్యాలు చిత్రీకరిస్తుండగా... డ్రెడ్జింగ్‌ ముఠా పడవలతో సహా అక్కడ నుంచి.... ఉడాయించింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఈ వ్యవహారం గాయత్రి-4 ఇసుక ర్యాంపు పరిధిలోని కొన్ని సొసైటీల ద్వారా సాగుతోందని... మిగతా ర్యాంపు జట్టు కూలీలు ఆరోపిస్తున్నారు.

లాభం తక్కువగా వస్తోందని.. నిబంధనలకు నీళ్లొదిలారు

నిబంధనల ప్రకారం జట్టు కూలీలు నదిలో మునిగి పడవ నిండుగా బకెట్లతో ఇసుక తోడుకుని వస్తే.. సుమారు 18 టన్నుల వరకు వస్తుంది. ఇది 2 టిప్పర్లకు సమానం. ఈ ప్రక్రియకు 2 నుంచి 3 గంటలు పడుతుంది. 10 మందికి పైగా కూలీలు అవసరం అవుతారు. ఇందులో... పెద్దగా మిగిలేదేమీ లేదని భావించిన కొందరు అక్రమార్కులు డ్రెడ్జింగ్‌ ద్వారా.. కేవలం గంట వ్యవధిలోనే 7 నుంచి 8 లారీలపైగా ఇసుకను బయటకు తెస్తున్నారు. అలా పడవల్లో ర్యాంపునకు చేర్చిన ఇసుకను.. కూలీలతో కాకుండా జేసీబీల ద్వారా ఒడ్డుకు దించేస్తున్నారు. దీనివల్ల తమ ఉపాధికి ముప్పు ఏర్పడుతోందని జట్టు కూలీలు వాపోతున్నారు.

NGT ఏం చెప్పింది..?

జాతీయ హరిత ట్రిబ్యునల్ ఉత్తర్వుల ప్రకారం నదిలో మూడు అడుగుల లోతు వరకే ఇసుక తవ్వాలి. వంతెనలు, బ్యారేజీలకు 3 కిలో మీటర్ల పరిధిలో ఎలాంటి ఇసుక తవ్వకాలు చేయకూడదు. కానీ... కాటన్ బ్యారేజీ సమీపంలోనే నిబంధనలకు విరుద్ధంగా.. డ్రెడ్జింగ్ వ్యవహారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై విచారణ చేస్తామని అంటున్నారు అధికారులు. గాయత్రి - 4 ర్యాంపులోనే పది నావలు డ్రెడ్జింగ్ ప్రక్రియ చేపడుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలాంటి వ్యవహారం మీద కేసులు వేశారు. ఈ దందాపై... ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

ఇదీ చదవండి:

50 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకే: సీఎం జగన్​

ABOUT THE AUTHOR

...view details