తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో 216 జాతీయ రహదారి కాకినాడ గ్రామీణం తూరంగి నుండి అమలాపురం వరకు సుమారు 56 కిలోమీటర్లు ఉండగా దీన్ని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు నాలుగు రీచ్లుగా గుత్తేదారు టాటా సంస్థ పనులు చేపట్టింది. ఇప్పటివరకు కోరంగి... తాళ్లరేవు.. ముమ్మిడివరం గ్రామాల పరిధిలో బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయింది. మరికొన్ని చోట్ల కల్వర్టుల నిర్మాణం జరుగుతుంది.
రోడ్డు విస్తరణ పనులు వేగంగా...
తూర్పుగోదావరి జిల్లాలో జాతీయ రహదారి 216 కత్తిపూడి నుండి పామర్రు వరకు నాలుగు వరుసలుగా అభివృద్ధి చేసే పనులు ప్రారంభమైన అయిదేళ్లు దాటినా ఇప్పటికీ పనులు పూర్తిస్థాయిలో జరగలేదు . గతంలో ఎంతో వేగంగా జరిగిన పనులు ... ప్రభుత్వం మారిన తర్వాత ఏడాదిన్నర కాలం పాటు నిలిచిపోయాయి. దీంతో అనేక ప్రాంతాల్లో వంతెనలు, రహదారి మార్గం మళ్లింపు పనులు అసంపూర్తిగా ఉండిపోయాయి. దీంతో ప్రమాదాల సంఖ్య భారీగా పెరిగింది. ఎట్టకేలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి పనులు చేపట్టడంతో విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి.
రోడ్డు విస్తరణ పనులు వేగంగా...
కాకినాడ అమలాపురం మధ్యనున్న కేంద్రపాలిత ప్రాంతం యానం ఎదుర్లంక వద్ద ప్రస్తుతం నిర్మాణ సంస్థ పనులు చేపట్టింది. ఇంతకాలం రహదారికి ఇరువైపులా ఆక్రమించి చేస్తున్న వివిధ రకాల వ్యాపారాలను తొలగించి రోడ్డును వెడల్పు చేస్తున్నారు. ఈ విస్తరణ తొందరగా పూర్తి అయితే వాహనదారులు తక్కువ సమయంలో గమ్య స్థానాలకు సురక్షితంగా చేరుకోవచ్చని ఆశిస్తున్నారు ప్రజలు.
ఇవీ చదవండి:అన్నవరం సత్యదేవుని ఆలయానికి విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్