Remand Prisoner Dead in Rajahmundry Jail:స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన భద్రతపై తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు భద్రత, ఆరోగ్యం, ఆహారం... తదితర విషయాలపై కోర్టులో వాదనలు సైతం జరిగాయి. తాజాగా రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీ మృతి చెందడంపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జైలులో డెంగ్యూతో వ్యక్తి మృతి చెందాడనీ.. అలాంటి పరిసరాల్లో చంద్రబాబును ఉంచడం ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని ఆరోపించారు. టీడీపీ నేతల ఆరోపణల నేపథ్యంలో జైళ్లశాఖ డీఐజీ స్పందించారు.
జైళ్లశాఖ డీఐజీ రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీ మృతిపై జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్ స్పందించారు. దోపిడి కేసులో సత్యనారాయణను ఈ నెల 6న రిమాండ్‌కు తీసుకొచ్చినట్లు డీఐజీ తెలిపారు. జ్వరం, ప్లేట్‌లెట్స్ పడిపోవడంతో ఈ నెల 7న ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలిపారు. డెంగ్యూతో నిన్న రిమాండ్ ఖైదీ సత్యనారాయణ మృతి చెందాడని వెల్లడించారు. జైలులో దోమల నివారణకు చర్యలు చేపట్టామని డీఐజీ పేర్కొన్నారు.. ఫాగింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. రాజమండ్రి జైల్లో దోమల లార్వా ఆనవాళ్లు ఏమి లేవని డీఐజీ తెలిపారు.
TDP Leaders Protest against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా కొనసాగిన టీడీపీ నిరసనలు
చంద్రబాబు భద్రత రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఓ ఖైదీ డెంగ్యూ వ్యాధితో చనిపోయాడని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. డెంగ్యూ వ్యాధితో ఖైదీ చనిపోవడంతో చంద్రబాబు భద్రత.. ఆరోగ్యంపై తమకూ ఆందోళన ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం చంద్రబాబు భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.
నందమూరి రామకృష్ణ ఆవేదన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం రిమాండ్ ఖైదీ మృతి చెందడంపై ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ధవళేశ్వరంకు 19 ఏళ్ల గంజేటి వీర వెంకట సత్యనారాయణ డెంగ్యూతో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులకు రామకృష్ణ సానుభూతి తెలిపారు. చంద్రబాబు జైలులో ఉన్నందున ఈ అంశం తమకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని రామకృష్ణ చెప్పారు. చంద్రబాబుకు జైలులో సరైన రక్షణ కల్పించాలని నందమూరి రామకృష్ణ డిమాండ్ చేశారు.
Lokesh Comments on CBN Security: చంద్రబాబుకు జైలులో ఏం జరిగినా జగన్‌దే బాధ్యత: లోకేశ్
కేంద్ర కారాగారంలో దోమలు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో దోమలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని పారిశుధ్యం లోపించిందంటూ యువగళం వాలంటీర్లు తమతో చెప్పారని తెలుగుదేశం ఆర్గనైజింగ్ సెక్రటరీ విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు చెప్పారు. కేంద్రకారాగారంలో ములఖత్ ద్వారా జ్యూడిషల్ రిమాండ్ లో ఉన్న యువగళం సభ్యులను కోటేశ్వరావు కలిశారు. ఇదే జైలులో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబుకు ప్రాణహాని ఉందంటున్న కోటేశ్వరరావు ఆరోపించారు.
Amaravathi Farmers protest in Mandadam : మాట తప్పిన సీఎంను గద్దె దింపే వరకూ పోరాడుతాం.. అమరావతి రైతుల నిరసన