తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని అనేక గ్రామాల్లో రేషన్ డీలర్లు, వినియోగదారులకు ఈ-పాస్ యంత్రాల నెట్వర్క్ సమస్య తలనొప్పిగా మారింది. ఈ-పాస్ యంత్రాల సర్వర్ సమస్యతో ప్రజలకు నిత్యావసర సరకుల పంపిణీకి ఆటంకం కలుగుతోంది. నవంబరు నెలకు సంబంధించి కోటా సరకులు తీసుకునేందుకు వచ్చిన వినియోగదారులు గంటల తరబడి రేషన్ దుకాణాల వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నెట్వర్క్ కలవదు..రేషన్ దొరకదు - తూర్పుగోదావరి జిల్లా వార్తలు
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో చౌకధరల దుకాణాల్లో ఈ-పాస్ యంత్రాల సర్వర్ సమస్యతో సరకులు ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. సర్వర్ పనిచేయకపోవడంతో వినియోగదారులు గంటల తరబడి దుకాణాల వద్ద వేడిచూస్తున్నారు. కోటా సరకులు తీసుకునేందుకు ఆఖరి రోజు కావడం వల్ల వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
నెట్వర్క్ కలవదు..రేషన్ దొరకదు
సర్వర్ పనిచేయకపోవడం వల్ల డీలర్లు లాగిన్ అయ్యేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సరకుల కోసం సాయంత్రం వరకు వేచి చూసి నిరాశతో వినియోగదారులు వెనక్కి వెళ్లారు. ఈ నెల కోటా సరకులు తీసుకునేందుకు ఆఖరి రోజు కావడం వల్ల వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి :వైన్స్‌కు అడ్డురాని కరోనా నిబంధనలు.. మీడియాకు అడ్డువస్తున్నాయా..?