అచ్చెన్నాయుడి అరెస్ట్ కక్షసాధింపు చర్యేనని తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే, తెదేపాసీనియర్నాయకుడు సీతంసెట్టి వెంకటేశ్వరరావు ఉద్ఘాటించారు. ఏసీబీ అధికారులు అర్ధంతరంగా అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు. శాసనసభలో ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని సమస్యలపై ప్రశ్నిస్తున్నందునే కక్షసాధింపుగా అరెస్టు చేయించాడని ఆరోపించారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకొని కనీసం అచ్చెన్నాయుడిని మందులు కూడా వేసుకోనీయకుండా అరెస్టు చేసి తీసుకు వెళ్లడం దారుణమన్నారు.
అచ్చెన్నాయుడి అరెస్ట్ కక్షసాధింపే: రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే - సీనియర్ తెదేపా నాయకులు సీతం సెట్టి వెంకటేశ్వరరావు
ఎమ్మెల్యే, మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత అచ్చెన్నాయుడి అరెస్ట్ కక్షసాధింపు చర్యే అని తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే అన్నారు.
రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే