ప్రజల సమస్యలను తీర్చే 'ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్' యాప్ - app
తన నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు.. వారికి మరింత చేరువయ్యేందుకు తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ సరికొత్త పంథాను ఎంచుకున్నారు. సమస్యల సత్వర పరిష్కారానికి మొబైల్ యాప్‌ని విడుదల చేశారు.
రాజమహేంద్రవరం నగర తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని... నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి మొబైల్ యాప్‌ను విడుదల చేశారు. నిత్యం రాజమహేంద్రవరం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా "ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్" అనే యాప్‌ను నగర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆమె శనివారం ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా తనకు చేరవేయొచ్చని ఎమ్మెల్యే భవాని సూచించారు. భవిష్యత్తులో నగర అభివృద్ధి కోసం తాను ఏం చేయబోతున్నాను తదితర విషయాలన్నీ యాప్ ద్వారా ప్రజలు తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రజల సమస్యలను ఇంకాస్త త్వరగా పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే ఈ యాప్‌ను రూపొంచించామని భవాని తెలిపారు.